Pawan and Rancharan indirect war..!

   యుద్ధం పక్కా అయింది.

                   మెగాహీరోల మధ్య తెరవెనక ఏదో జరుగుతోంది. పవన్ కల్యాణ్ కు మెగాహీరోలకు పడట్లేదనే విషయం ఇప్పుడు స్పష్టంగా మరోసారి అర్థమౌతోంది. అటు ఎవడు, ఇటు అత్తారింటికి దారేది సినిమాలు మెగాకాంపౌండ్ లో చిచ్చురేపాయి. సై అంటే సై అనేలా చేస్తున్నాయి.

              అత్తారింటికి దారేది సినిమాను ఆగస్ట్ 7న  రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎవడు సినిమాను 31కి విడుదల చేయాలనుకున్నారు. కాని పవన్ మాత్రం తన కొత్త సినిమా పోస్ట్ పోన్ మెంట్ కు ఒప్పుకోలేదు. దీని వెనక కారణముంది. పవన్ తన సినిమా డేట్ ను ఎనౌన్స్ చేసేటప్పుడే ఎవడు టీంను అడిగి ఫిక్స్ చేశాడు. ఎవడు సినిమాను జూన్ లో తీసుకొస్తామని అప్పట్లో వాళ్లు చెప్పారట. దీంతో పవన్ తన కొత్త సినిమాను ఆగస్ట్ కు ప్లాన్ చేసుకున్నాడు. కట్ చేస్తే ఎవడు ఆలస్యమై జులై ఎండింగ్ కు వచ్చింది. ఇప్పుడు మరోసారి పవన్ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమనడంతో పవర్ స్టార్ ఒప్పుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లో ఆగస్ట్ 7కే సినిమా రిలీజ్ అని తెగేసి చెప్పాడు. 
                   
                పవన్ ఒప్పుకోకపోవడంతో రామ్ చరణ్ కూడా యుద్ధానికి సై అన్నాడు. ఎవడు సినిమాను పోస్ట్ పోన్ చేసుకోకుండా పవన్ సినిమాకు పోటీగా వారం ముందు రిలీజ్ చేస్తున్నారు. జులై 31నే ఎవడును థియేటర్స్ లోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఎవడు టీం ప్రకటించిన కొద్ది గంటలకే అత్తారింటికి దారేది టీం కూడా ఎనౌన్స్ మెంట్ ఇచ్చింది. అత్తారింటికి దారేది సినిమా విడుదల తేదీలో కూడా మార్పులేదని దాని సారాంశం. ఇలా కేవలం గంటల వ్యవధిలో రెండు సినిమాలు నువ్వంటే నువ్వా అన్నట్టు ప్రకటనలు, స్టిల్స్ రిలీజ్ చేశాయి. ఈ వ్యవహారం మొత్తం మెగాకాంపౌండ్ లో అంతర్గతంగా ఉన్న పొరపొచ్చాల్ని బయటపెడుతోంది. 

                  ప్రస్తుతానికైతే రామ్ చరణ్ సినిమా జులై 31, పవన్ సినిమా ఆగస్ట్ 7కే ఫిక్స్ అయ్యాయి. అయితే చిరంజీవి జోక్యం కల్గించుకొని ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసే సూచనలున్నాయని అంటున్నారు. చూద్దాం... ఈ ఇండైరెక్ట్ మెగావార్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో..
 
English summary

indirect war between ramcharan and pawan kalyan. these two heroes are ready to lock horns at box office. ram charan announced that his latest film yevadu must come on july 31st. pawan also not willing to postpone his new movie. so in one week gap atharintiki daredi and yevadu will hit the screens. but in last minute any one film might postpone.



Tags : ap cinema news, tollywood news, tollywood gossips, pawan hero, ramcharan hero, pawan vs ramcharan indirect war, yevadu july 31th, attarintiki daredi august 7th, tollywood big fight